ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- March 16, 2026
విజయవాడ: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్’లో సోమవారం ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల దురాక్రమణను అరికట్టి, వాటిని పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత 21 నెలల పాలనలో ముస్లింల సంక్షేమం కోసం అమలు చేసిన పలు పథకాలను చంద్రబాబు వివరించారు. విద్య, ఉపాధి రంగాల్లో మైనార్టీ యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







