ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్ముకున్న పొగ మంచు..
- January 09, 2023
న్యూ ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను పొగ మంచు కమ్మేస్తోంది.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది.పొగమంచు ప్రభావం రవాణా వ్యవస్థపై పడుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంను పొగమంచు కమ్మేసింది.
దీంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు విమానాశ్రయంలోనే నిలిచిపోయాయి.దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.విమానాశ్రయం పరిధిలో దారి కనిపించకపోవడంతో మూడు విమానాలను అధికారులు దారి మళ్లించారు. షార్జా నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంతోపాటు, అహ్మదాబాద్, పూనేల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాల్ని జైపూర్ పంపించారు.
భారత వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం.. పంజాబ్, రాజస్థాన్, బిహార్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లో పొగ మంచు పొరలాగా కమ్ముకున్నట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పొగ మంచు ప్రభావంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ఈ విషయం పై ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని, దీనికోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విజిబిలిటీ రేటు ఉదయం ఐదున్నర గంటల సమయంలో 0 మీటర్లుగా ఉందంటే అక్కడి పరిస్థితిని అంచనావేయొచ్చు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







