‘వీరయ్య’కు హ్యాండిచ్చిన శృతిహాసన్.! ఊర్వశికి బాగా కలిసొచ్చిందే.!
- January 09, 2023
ఒకేసారి రెండు సినిమాలూ రిలీజ్ అవ్వడం హీరోయిన్‌కి నిజంగా పండగే. ఆ పండగ, ఈ ఏడాది సంక్రాంతికి శృతిహాసన్‌కి వచ్చింది. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు, ఒకే బ్యానర్లో రూపొందిన సినిమాలు.
ఒక్క రోజు తేడాలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయ్. ఎక్కడ చూసినా శృతిహాసన్ మాటే. ప్రమోషన్ల పేరు చెప్పి, ఎక్కడ చూసినా శృతిహాసనే కనిపిస్తుందనుకున్నారంతా.
అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. పాపం శృతి హాసన్. మొన్న జరిగిన ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తళుక్కున మెరిసింది కానీ, నిన్న జరిగిన ‘వాల్తేర్ వీరయ్య’ ఈవెంట్‌కి హాజరు కాలేకపోయింది.
తీవ్రమైన జ్వరం, జలుబు కారణంగా ‘వీరయ్య’ ఫంక్షన్‌కి శృతి హాసన్ హాజరు కాలేకపోయిందట. కరోనా పాజిటివ్ అని అనుమానంగా వుందట శృతిహాసన్‌కి.
అంతకు ముందు జరిగిన వీరయ్య ప్రెస్ మీట్‌కి కూడా శృతిహాసన్ రాలేదు. దాంతో, మెగా అభిమానులు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఛాన్స్‌ని మరో భామ ఊర్వశి రౌతెలా బాగా యూజ్ చేసుకుంది. బార్బీ బొమ్మలా ముస్తాబై ‘వీరయ్య’ ఈవెంట్‌కి సరికొత్త గ్లామర్ తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







