24 సినిమా మే 6న రిలీజ్...
- April 28, 2016
సెన్షేషనల్ డైరక్టర్ విక్రం కుమార్ దర్శకత్వంలో సూర్య నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 24. టైం మిషన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో త్రిపాత్రాభినయంలో నటిస్తున్న సూర్య సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పటికే సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ సినిమా ఎలా ఉండబోతుందో రుచి చూపించాయి. అయితే ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో యూ.ఎస్ లో అత్యధికంగా 250 థియేటర్స్ పైగా రిలీజ్ చేస్తున్నారట చిత్రయూనిట్.హాలీవుడ్ సినిమాగా రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆలోచనతో సినిమాను తెలుగు తమిళ భాషల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారట. మే 6న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా అంతకుముందు రోజు అనగా మే 5నే భారీ ప్రీమియర్స్ కూడా పడే అవకాశాలున్నాయని తెలుస్తుంది.యూ.ఎస్ లో పింక్ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తున్న సూర్య 24 రిలీజ్ ముందు రోజు భారీ ప్రీమియర్స్ కు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు సినిమా కచ్చితంగా 240 కోట్లు కలెక్ట్ చేస్తుందని బల్ల గుద్ది చెబుతున్నాడు 24 సినిమా సహనిర్మాత కె.యి.జ్ఞాన్ వెల్ రాజా. అందుకే సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 2150 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని అన్నారు.సూర్య, సమంత, నిత్యా మీనన్ నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించాడు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









