తమిళ నాట ఆ పెద్ద సినిమాలకు బిగ్ షాక్.!
- January 11, 2023
సంక్రాంతికి తమిళంలో స్టార్ హీరోలు అజిత్, విజయ్ బాక్సాఫీస్ వద్ద పోరుకు దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు అనగా, జనవరి 11 బుధవారం ఈ రెండు పెద్ద సినిమాలూ తమిళ బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్ధమయ్యాయ్.
అయితే, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు, అది కూడా సంక్రాంతి వంటి పెద్ద పండగల నేపథ్యంలో అదనపు షోలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటుంటారు.
అయితే, ‘వారిసు’, ‘తుళివు’ సినిమాలకు కేవలం 11, 12 వ తేదీల్లోనే అదనపు షోలకు అనుమతి లభించింది. పండగ సందర్భంగా అంటే 13, నుంచి 16 వరకూ ఎలాంటి అదనపు షోలూ ప్రదర్శించడానికి అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ధియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు వంటివి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గించరాదని నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
అదేంటో, ఈ సారి సంక్రాంతి ఈ తమిళ సినిమాలకు తెలుగులోనే కాదు, సొంత గడ్డపైనా షాకుల మీద షాకులిస్తోందేంటో.! అజిత్ సినిమా ‘తెగింపు’ పేరుతో తెలుగులో విడుదలైంది. కానీ, విజయ్ సినిమా ‘వారసుడు’ అర్ధాంతరంగా పోస్ట్‌పోన్ అయిపోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







