గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’.!
- January 11, 2023
అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డుకు అత్యంత ఆదరణ వున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ‘ఆస్కార్’ అవార్డుది మొదటి స్థానం. ఆ తర్వాతి స్థానంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు నిలుస్తుంది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును దక్కించుకునే బరిలో నిలిచేందుకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని తెలిసిందే.
ఈ క్రమంలో ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టకుండా ప్రయత్నిస్తూ వుంది జక్కన్న టీమ్. ఈ నేపథ్యంలోనే ‘నాటు నాటు’ ది ఒరిజినల్ బెస్ట్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది.
అంతర్జాతీయ వేదికపై ఈ అరుదైన గొప్పదనం సాధించినందుకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. మన తెలుగు సినిమాకి దక్కిన అద్భుతమైన గౌరవమిది. గొప్ప చారిత్రక విజయం.. అంటూ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై కీర్తించే అవకాశం కల్పించినందుకు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







