‘వీరయ్య’ - ‘వీర సింహారెడ్డి’లకు టికెట్ల ధరలు పెంపు.!
- January 11, 2023
ఈ మధ్య టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే, సినిమా రిలీజ్ డేట్లు, అప్‌డేట్లతో పాటూ, మా సినిమాకి టిక్కెట్ రేట్లు పెంచడం లేదహో.. అని కూడా డప్పు కొట్టి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి.
అయితే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెండు పెద్ద సినిమాలు ‘వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ల విషయంలో ఆ సమస్యకు సులువుగానే పరిష్కారం లభించింది. ఈ రెండు సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
‘వీర సింహారెడ్డి’కి 20 రూపాయలు, ‘వాల్తేర్ వీరయ్య’కు 25 రూపాయల చొప్పున టిక్కెట్ ధరను పెంచుకునేందుకు అనుమతి లభించగా, వీటిపై జీఎస్‌టీ పెంపు అదనంగా వుండనుంది. విడుదల తేదీ నుంచి కేవలం 10 రోజులు మాత్రమే ఈ పెరిగిన ధరలు అమలులో వుండనున్నాయ్.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







