హైదరాబాద్ లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం
- January 12, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ , బిజినెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుపుగా..ఇప్పుడు మరోసారి సోదాలు మొదలుపెట్టారు. బాల నగర్ లోని పలు కెమికల్ కంపెనీలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు కెమికల్ కంపెనీలకు సంబంధించి మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ రెండు కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు సమాచారం అందటంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. కాగా.. ఢిల్లీ నుంచి మొత్తం ఆరు బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. వారం రోజుల కిందట హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ శాఖ సోదాలు కలకలం రేపాయి. సుమారు 20 బృందాలుగా ఏర్పడిన 60 మంది ఐటీ అధికారులు.. ఒకేసారి వివిధ చోట్ల దాడులు నిర్వహించారు.
గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్‌ఫ్రా, ఐటీ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ఎక్సెల్ గ్రూప్ నడుపుతోంది. అలాగే.. బాచుపల్లి, చందానగర్, కోకాపేట, బాబుఖాన్ లేక్ ఫ్రంట్ విల్లాస్‌లోని అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరపటం చర్చనీయంగా మారింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







