పాకిస్తాన్ లో పెట్టుబడి మార్గాలు వెతకండి: సౌదీ ప్రిన్స్
- January 12, 2023
రియాద్: ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఆదుకొనేందుకు సౌదీ అరేబియా ప్రయత్నాలు మొదలు పెట్టింది.క్రౌన్ ప్రిన్స్ మరియు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ మధ్య ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ చర్య వచ్చింది.
పాకిస్థాన్ కు సాయం చేయడానికి, అక్కడ పెట్టుబడులను పెంచడానికి ఉన్న అవకాశాలను వెతకాలని దేశ అధికారులను క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారు.పాకిస్థాన్ బ్యాంక్‌లోని తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్లకు పెంచడానికి ఉన్న మార్గాలపై సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అన్వేషణ నిర్వహించనుంది. దీంతోపాటు పాక్‌లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్లకు పెంచే మార్గాలపై కూడా దృష్టిపెట్టనుంది.
ప్రస్తుతం పాక్ లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 5.6 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి.గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యల్పం.ఇవి కేవలం ఒక నెలరోజులపాటు దిగుమతులకు సరిపోతాయి. ఈ క్రమంలో డాలర్లను కాపాడుకొనేందుకు పాక్ అనేక చర్యలను చేపట్టింది.గత నెల సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల రుణాన్ని పాకిస్థాన్‌కు అందజేసింది. తాజాగా మరింత సాయం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఒక డాలర్‌కు 228 రూపాయిలుగా నడుస్తోంది.మరో వైపు సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) వద్దకు పాక్ వెళ్లింది. ఐఎంఎఫ్ విడతలవారీగా 800 కోట్ల డాలర్ల మేరకు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. అయితే అందుకు బోలెడన్ని షరతులు విధిస్తోంది.ముఖ్యంగా పన్నులు పెంచాలంటోంది. వాటిని అంగీకరిస్తే ప్రజలపై భారం పడుతుంది. అసలే రాజకీయంగా, ఆర్థికంగా నలిగిపోతున్న ప్రజానీకం తిరగ బడితే సమస్యలు తీవ్రమవుతాయనే భయం నాయకుల్లో ఉంది. దీంతో ఐఎంఎఫ్ సాయం అనిశ్చితిలో పడింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి