26వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

- January 12, 2023 , by Maagulf
26వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటక: 26వ జాతీయ యువజనోత్సవాలను కర్ణాటకలోని హుబ్బిలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు మొదటిసారి కర్ణాటక రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 7500 మంది ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది ఒక్కో రాష్ట్రంలో నిర్వహించడం ఆనవాయితీ. కాగా గత ఏడాది పుదుచ్చేరిలో జరిగాయి.

జీ-20, వై-20 కార్యక్రమాల అనంతరం జరగుతోన్న ఈ కార్యక్రమం ఆ రెండు కార్యక్రమాల నుంచి వచ్చిన ఐదు థీమ్‌లపై ప్లీనరీ చర్చకు సాక్ష్యంగా నిలవనున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు వీటిలో ప్రధానమైనవి. కాగా, వాతావరణ మార్పు, విపత్తు ప్రమాద తగ్గింపు; శాంతి నిర్మాణం, సయోధ్య; ప్రజాస్వామ్యం, పాలనలో భవిష్యత్తు-యువతకు భాగస్వామ్యాలతో పాటు ఆరోగ్యం & శ్రేయస్సు వంటి అంశాలను కీలకంగా తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com