సంక్రాంతి ప్రత్యేక సర్వీసులను విశేషంగా ఆదరించిన ప్రయాణీకులు: ఏపీఎస్ ఆర్టీసీ ఎండి
- January 17, 2023
విజయవాడ: సంక్రాంతికి ముందు రోజుల్లో జనవరి 6 నుండి 14 వరకు ఏపీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులు నడిపింది.సంక్రాంతికి ముందు రోజుల్లో 3120 ప్రత్యేక బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు ఏపీఎస్ 16న మీడియా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నందున ఏపీ, తెలంగాణ, తదితర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తిరుగు ప్రయాణ టిక్కెట్ ఛార్జీపై 10శాతం రాయితీ సౌకర్యం కూడా ప్రయాణికులను ఏపీఎస్ వైపు ఆకర్షించేలా చేసింది. గత సంవత్సరం ఏపీఎస్ సంక్రాంతి ముందు రోజుల్లో 2,400 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ‘సాధారణ ఛార్జీలు’ వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులకే ఎక్కువ మొగ్గు చూపారు. దీని ఫలితంగా స్థూల ఆదాయం బాగా పెరిగింది. గత సంవత్సరం సాధించిన ఆదాయం రూ . 7.17 కోట్లుతో పోలిస్తే, ఈ సంవత్సరం 50% అదనపు ఛార్జీలు లేకుండానే అదనంగా రూ. 7.90 కోట్ల ఆదాయం ఆర్జించడం జరిగింది. కాగ, గత ఏడాది ఇవే రోజుల్లో సాధించిన రూ.107 కోట్ల ఆదాయం కంటే ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం ఏపీఎస్ ఆర్టీసీ సాధించగలిగిందని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.
ఏపీఎస్ ఆర్టీసీ,గత ఏడాది హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 824 బస్సులు నడపగా, ఈ సంవత్సరం 1,483 ప్రత్యేక బస్సులను నడిపింది.హైదరాబాద్లో సరైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ పెద్ద ఎత్తున బస్సులు నడిపి, ప్రయాణికుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రత్యేక సర్వీసులను నిర్వహించగలిగింది. కాగా ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర అంతఃరాష్ట్రాలకు వెళ్లే తిరుగు ప్రయాణికుల కోసం రద్దీని బట్టి ముందస్తు సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ, బస్సులు నిరంతరం అందుబాటులో ఉంచడం జరిగింది. సంక్రాంతి ముందు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించినందుకు ప్రయాణికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ అంతటా అన్ని ప్రదేశాల నుండి తగిన సంఖ్యలో తిరుగు ప్రయాణం కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినందున ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఆదరించి మా సేవలను పొందడం కొనసాగించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







