యూఏఈలో పెరిగిన వీసా, ఎమిరేట్స్ ఐడీ ఖర్చులు!

- January 20, 2023 , by Maagulf
యూఏఈలో పెరిగిన వీసా, ఎమిరేట్స్ ఐడీ ఖర్చులు!

యూఏఈ: యూఏఈలో పెరిగిన వీసా, ఎమిరేట్స్ ఐడీ ఖర్చులు పెరిగాయి. కొత్తగా ఎమిరేట్స్ ఐడి, వీసాల జారీకి రుసుములు పెరిగాయని ట్రావెల్, టైపింగ్ సెంటర్ ఏజెంట్లు చెబుతున్నారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP)కి చెందిన ఒక కస్టమర్ కేర్ ఏజెంట్ మాట్లాడుతూ.. వీసా, ఎమిరెట్ ఐడీ ఫీజులు Dh100 పెరిగినట్లు వెల్లడించారు. ఎమిరేట్స్ ID, విజిట్-రెసిడెన్సీ వీసాలకు ఫీజు పెంపు వర్తిస్తుందని ఓ టైపింగ్ సెంటర్ ఏజెంట్ తెలిపారు. ఎమిరేట్స్ ID ఇప్పుడు Dh270కి బదులుగా Dh370 అయిందన్నారు. ఒక నెల సందర్శన వీసా జారీ చేయడానికి రుసుము Dh270కి బదులుగా Dh370 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, దుబాయ్ నుండి జారీ చేయబడిన విజిట్ వీసాలలో ఇంకా ఎటువంటి మార్పులు లేవని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని తెలిపారు. ICP ఇటీవల దేశంలో ఎక్కువ కాలం గడిపిన వీసాలపై జరిమానాను 50 దిర్హామ్‌లుగా నిర్ణయించింది. దీంతో టూరిస్ట్, విజిట్ వీసా హోల్డర్‌లు ఎక్కువ కాలం బస చేసేవారు 100 దిర్హామ్‌లకు బదులుగా రోజుకు 50 దిర్హామ్‌లు చెల్లించాలి. అలాగే రెసిడెన్సీ వీసాపై ఎక్కువ కాలం ఉంటున్న వారు రోజుకు 25 దిర్హామ్‌లకు బదులుగా రెట్టింపు 50 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరం యూఏఈలో ఎంట్రీ,  రెసిడెన్సీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.   గోల్డెన్ వీసా స్కీమ్, కొత్త ఐదేళ్ల గ్రీన్ రెసిడెన్సీ, మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా, జాబ్ హంటింగ్ ఎంట్రీ పర్మిట్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com