వాట్సాప్‌లో పెద్ద అప్డేట్..
- January 20, 2023ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్లో కొన్ని మల్టీ ఫీచర్లపై పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. వాట్సాప్ తమ యూజర్ల కోసం త్వరలో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను షేర్ చేసేందుకు కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
ఈ ఏడాదిలో వాట్సాప్ అతిపెద్ద అప్డేట్లలో ఒకటిగా రానుంది.వాట్సాప్ యూజర్లకు చాలా అవసరమైన ఫీచర్. కాంటాక్ట్‌లతో హై-క్వాలిటీ ఫోటోలను షేర్ చేయడంలో ఈ ఫీచర్ సాయపడుతుంది. WaBetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం..వాట్సాప్ ఫొటో క్వాలిటీ ఆప్షన్ యాడ్ చేస్తుంది. మీరు మీ కాంటాక్టులతో మీడియాను షేర్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఫొటో క్వాలిటీ కోసం ఐకాన్ డ్రాయింగ్, ఇతర టూల్స్‌తో పాటు స్క్రీన్ పైభాగంలో ఉంటుంది.
వాట్సాప్ తమ ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను షేర్ చేసుకోవచ్చు.తమ కాంటాక్టులతో మీడియాను షేర్ చేయాలనుకున్న ప్రతిసారీ క్వాలిటీ సెట్టింగ్‌ను మార్చవలసి ఉంటుంది.రాబోయే వారాలు లేదా నెలల్లో వాట్సాప్ తమ ఫీచర్ల పై మరింత క్లారిటీ ఇవ్వనుంది.కానీ, ఈ ఫీచర్‌ని యాడ్ చేయడంతో మీ డివైజ్ గతంలో కన్నా ఎక్కువ డేటాను ఉపయోగిస్తుందని చెప్పవచ్చు.
ఫొటోలను డౌన్లోడ్ చేసేందుకు Wi-Fiని ఉపయోగించవచ్చు. ఎందుకంటే మీరు ప్రస్తుతం పంపుతున్న ఫొటోలతో పోలిస్తే ఫొటోల రిజల్యూషన్, సైజు చాలా ఎక్కువగా ఉంటుంది.వాట్సాప్ ప్రస్తుతం మీరు పంపే ఫొటోలు లేదా వీడియోల క్వాలిటీ రెండు కారణాల వల్ల కంప్రెస్ చేస్తుంది. లో-క్వాలిటీ కంటెంట్ తక్కువ డేటాతో చాలా త్వరగా డౌన్లోడ్ అవుతుంది.
మొబైల్ డేటాను సేవ్ చేసేందుకు మీడియాలో ఆటో-డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 2.23.2.11 బీటా అప్డేట్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.ప్రస్తుతం, మీరు యాప్‌లో ఆటోమేటిక్, బెస్ట్ క్వాలిటీ, డేటా సేవర్‌తో సహా 3 ఫోటో క్వాలిటీ ఆప్షన్లను పొందవచ్చు. కానీ, బెస్ట్ క్వాలిటీ అంత ప్రభావవంతంగా లేదు.యాప్‌లో అధిక రిజల్యూషన్ ఫొటోలను అందించదు. బెస్ట్ క్వాలిటీ ఆప్షన్లో యాప్ ఏ ఇమేజ్ సైజును సపోర్ట్ చేస్తుందో వాట్సాప్ వెల్లడించలేదు.
ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉందని, భవిష్యత్తులో అందరి యూజర్లకు అందుబాటులోకి రానుందని ఓ నివేదిక వెల్లడించింది. వాట్సాప్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో విషయాలను షేర్ చేసుకోవచ్చు.రాబోయే అప్డేట్ ద్వారా మరింత మెరుగైన మెసేజింగ్ యాప్‌గా పనిచేస్తుంది.టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లు ఇప్పటికే యూజర్లు పెద్ద ఫైల్లు లేదా హై-క్వాలిటీ ఫొటోలను పంపుకునేందుకు అనుమతిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం