చలికాలంలో చర్మం పొడిబారుతోందా.?
- January 20, 2023
శీతాకాలం వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా వుంటుంది. అందుకే, చర్మం పొడిబారిపోతుంది. చలి గిలి ఎక్కువగా వున్న కారణంగా ఎక్కువగా నీరు త్రాగాలని అనిపించదు. తద్వారా శరీరంలో నీటి శాతం తక్కువయిపోయి డీ హైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయ్.
ఊరికే నీరసం రావడం, కండరాల నొప్పులు, రక్తపోటు, చికాకు, తలనొప్పి తదితర సమస్యలు తలెత్తుతాయి. దాహం వేయకపోయినా, తగినంత నీరు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో రోగ నిరోధక శక్తి కూడా చాలా బలహీనంగా వుంటుంది. అందుకే, రకరకాల ఫ్లూ సంబంధిత వ్యాధుల బారిన సులువుగా పడుతుంటాం. చలికాలంలో నీరు తాగడం కష్టమే అయినప్పటికీ ఖచ్చితంగా తాగాల్సిన ఆవశ్యకత వుంది. కాబట్టి. అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయ్. అవేంటో తెలుసుకుందాం.
ఓ గ్లాసు వాటర్‌లో కొద్దిగా నిమ్మరసం.. అదేనండీ నిమ్మకాయ నీళ్లు తాగి చూడండి.
వివిధ రకాల పండ్ల రసాలను చిక్కగా కాకుండా కాస్తంత నీరు జోడించి గడ గడా తాగేయండి.
చలికాలంలో చెమట ఎక్కువగా పట్టని కారణంగా శరీరంలో ఉప్పు నిల్వలు ఎక్కువయిపోతాయ్. ఉప్పు శాతం పెరిగితే అధిక రక్తపోటు సమస్యలొస్తాయ్. అందుకే వీలైనంత తక్కువ ఉప్పు తీసుకోవాలి.
నీటి శాతం అధికంగా వుండే, పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా వుండే కాఫీలూ, టీలూ తగ్గించాలి.హెర్బల్ టీలకు ప్రాధాన్యమిస్తే మంచిది. అలాగే, శరీరాన్ని వెచ్చగా వుంచేందుకు వేడి వేడి ద్రవాలు తీసుకోవడం కూడా ఉత్తమం.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..