జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని అమలకు స్థానం..
- April 29, 2016
టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అమలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇచ్చింది. స్వతహాగా జంతువులంటే అమలకు ఎంతో ప్రాణం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరుపున జంతు సంరక్షణ కోసం కృష్టి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని భార్య అమలకు స్థానం దక్కింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అక్కినేని అమలను సభ్యురాలిగా తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా అక్కినేని అమల గత కొన్నాళ్లుగా సినిమాలుగా దూరంగా ఉంటున్నారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
ఈ చిత్రంలో నటనకు గాను ఆమె బెస్ట్ సపోర్టింగ్ రోల్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







