నారా లోకేష్ ను కలసిన ప్రముఖ ఎన్నారై, కువైట్ తెలుగు దేశం అధ్యక్షులు కుదరవలి సుధాకర రావు
- April 29, 2016
ప్రముఖ ఎన్నారై, కువైట్ తెలుగు దేశం అధ్యక్షులు కుదరవలి సుధాకర రావు శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి శ్రీ నారా లోకేష్ ను కలిసి ఆయనను మే 20వ తారీఖున కువైట్ లో జరుప బోయే మిని మహానాడు కు ఆహ్వానించారు. కువైట్ లో సుమారు 2 లక్షల మంది తెలుగు వారున్నారని, వారిలో ఎక్కువమంది తెలుగు దేశం పార్టీ అభిమానులేనని, వారందరు లోకేష్ బాబు గారి రాకకై ఎదురు చూస్తున్నారని వివరించారు. సుధాకర రావు అభ్యర్దన మేరకు త్వరలోనే ఎన్నారై మంత్రి రఘునాధ రెడ్డి మరియు ఏ.పి.ఎన్నార్టి చీఫ్ వేమురి రవి కుమార్ గారితో కలసి కువైట్ పర్యటనకు వస్తానని లోకేష్ బాబు వివరించారు. తెలుగుదేశం కువైట్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను సుధాకర రావు లోకేష బాబు కు వివరించారు.
ఆ తరువాత జరిగిన కార్యక్రమములో సుధాకర రావు లోకేష్ బాబు చేతులమీధుగా ఎన్టిఆర్ ట్రస్ట్ కు అంబులెన్స్ ను బహూకరించారు. పూజా కార్యక్రమాలనంతరము జండా వూపి అంబులన్స్ ను ప్రారంభించారు. తరువాత విలేకరుల సమావేశములో ఎన్టిఆర్ ట్రస్ట్ సి.ఈ.వో. విష్ణు వర్ధన్ మాట్లాడుతూ అంబులన్స్ ను బహూకరించినందుకు అభినందిస్తూ సుధాకర రావు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత సుధాకర రావు మాట్లాదుతూ విదేశాలలో దురదృష్ట వశాత్తు అనారోగ్యం పాలై లేక మరణించిన వారిని చెన్నై, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం విమానాశ్రయాలనుండి వారి ఇండ్లకు చేరవేయటానికి ఉపయోగ పడాలనే ఉద్దేశ్యముతో ఈ అంబులన్స్ ను ఎన్టిఆర్ ట్రస్ట్ కు ఇచ్చినట్లు తెలియ చేసారు. ఎన్టీఅర్ ట్రస్ట్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను సుధాకర రావు కొనియాడారు. గల్ఫ్ దేశాలలో ఎంటీఅర్ ట్రస్ట్ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తానని మరియు ముందు ముందు సేవా కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటానని తెలియ చేసారు. గుంటురు జిల్లా బొబ్బర్లంక గ్రామమునకు చెందిన కుదరవల్లి సుధాకర రావు గత పది హేను సంవత్సరాలుగా కువైట్ లో ఉంటున్నట్లూ వివరించారు. ఏ కార్యక్రమములో ఏ.పి.ఎన్నర్టీ చీఫ్ రవి వేమురి గారు, బుచ్చిరాం గారు, నిరంజన్ గారు, మురళి గారు, శరత్ గారు, వెంకట అప్పా రావు గారు, నాగెంద్ర బాబు గారు, కాపెర్ల పట్టభి రాము గారు, ఎన్టిఆర్ ట్రస్త్ సిబ్బంది పాల్గొన్నరు.







తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







