అల్-మమ్జార్ బీచ్‌లో విషాదం.. భార్యను రక్షించే ప్రయత్నంలో భర్త మృతి
- January 24, 2023
యూఏఈ: అల్-మమ్జార్ బీచ్ లో విషాదం చోటుచేసుకున్నది. భార్యను రక్షించే ప్రయత్నంలో ఓ భర్త మృతి చెందాడు. షార్జా సివిల్ డిఫెన్స్, షార్జా పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం (జనవరి 22) సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్‌కు అరబ్ వ్యక్తి ఫోన్ చేసి అల్-మమ్జార్ బీచ్‌లో ఓ ఆసియా జంట మునిగిపోయిన సంఘటన జరిగిందని సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. నీటిలో మునిగిపోతున్న మహిళను రక్షించారు. ఆమె భర్త కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అతని మృతదేహాన్ని గుర్తించాయి. నీట మునిగిన భార్యను రక్షించే క్రమంలో అతడు మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు షార్జా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







