యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- January 24, 2023
లండన్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో NRI TDP UK అధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. NRI TDP UK ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభకాంక్షలు తెలియజేసారు.
కోవెంట్రీ నగరంలో యూకె టీడీపీ వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ నెల 27న ప్రారంభం కాబోతున్న 'యువగళం' పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ సంఘీభావంగా NRI TDP UK శ్రేణులు పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు.
అనంతరం సభాకార్యక్రమం నిర్వహించబడింది. సభా ప్రాంగణం ' సైకో పోవాలి సైకిల్ రావాలి ' అనే నినాదంతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమం లో పలువురు ఎన్నారై టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూరుకుపోయిన అంధకారం తొలగిపోయి అభివృద్ధి బాటలో నడవాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో టీడీపీ యూకే నేతలు కిరణ్ పరచూరి, ప్రసన్న నాదెండ్ల ,సురేష్ కోరం, శ్రీనివాస్ పాలడుగు, నవీన్ జవ్వాడి, సుందర్ రాజు మల్లవరపు, మేరీ కల్పన, భాస్కర్ అమ్మినేని, అమర్నాథ్ మన్నే , కుమార్ నిట్టల తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







