కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్
- January 24, 2023
కొండగట్టు: జనసేన పార్టీ ప్రచార రథం వారాహి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ రథంలోకి ఎక్కారు. వారాహి పై నుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. వారాహికి పూజల కోసం పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం కొండగట్టు చేరుకున్నారు. కొండగట్టు ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ అభివృద్ధికి, లోక కల్యాణానికి, కొండగట్టు అంజనేయ స్వామి ఆశీర్వాదం కోరుతూ పార్టీ ప్రచార రథానికి పండితులు పూజలు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ ను వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. తర్వాత పవన్ కల్యాణ్ తో పండితులు ఫొటోలు దిగారు.
కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. జనసేన కార్యకర్తలు, అభిమానుల సందడితో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. వారాహికి పూజలు పూర్తయ్యాక వాహనంలోకి ఎక్కి అభిమానులు, కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. కాగా, ఉదయం 11 గంటలకే పవన్ కల్యాణ్ కొండగట్టు చేరుకోవాల్సి ఉండగా.. ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







