హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం

- January 25, 2023 , by Maagulf
హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్‌ నుంచి గోవాకు ఆకాశ ఎయిర్‌ తొలి విమాన సర్వీసును ఈరోజు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. ప్రారంభ విమానం హైదరాబాద్ నుండి గోవాకు మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరింది. ఆకాశ హైదరాబాద్ నుండి బెంగళూరుకు రోజువారీ విమానాలను కూడా ప్రారంభించింది. GHIAL, ఆకాశ సీనియర్ అధికారులు మరియు ఇతర విమానాశ్రయ భాగస్వాములు విమానాశ్రయంలో ఈ రోజు ఆకాశ ఎయిర్‌లైన్ తొలి విమాన సర్వీసులో వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు పలికారు. 

ప్రదీప్ పణికర్, CEO-GHIAL మాట్లాడుతూ, “హైదరబాద్ నుంచి వీలైనంత దేశీయ ఎయిర్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను విస్తరించడం, మరిన్ని విమానయాన సంస్థలను జోడించడానికి మేం  తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో GHIAL నుంచి ఆకాశ ఎయిర్‌ సర్వీసులు ప్రారంభించడంపై మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దశల వారీగా విస్తరణ, తద్వారా విమానాశ్రయ సామర్థ్యం పెరుగుదలతో, మరిన్ని గమ్యస్థానాలకు కొత్త సర్వీసులు రావడం వల్ల మరింత ఎక్కువ మంది ప్రయాణికులు విమాన ప్రయాణాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంది. భారతీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ఆకాశ ఎయిర్‌ సర్వీసుల ప్రారంభం ఈ దిశగా మరో ముందడుగు.’’  అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com