హీరో అడివి శేష్ ఇంట పెళ్లి సందడి
- January 25, 2023
హిట్ 2 తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేషు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. శేషు సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, మెహందీ ఈవెంట్స్ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్‌తో పాటు పలువురు సినిమా తారలు ఈ వేడుకల్లో సందడి చేశాడు. కాగా తన సోదరి వివాహానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు అడివి శేష్ . ‘చెల్లి పెళ్లిలో అమ్మానాన్న, నేను ఆనందంగా గడుపుతున్నాం. మా బావ డేవిన్ ని మా కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం’ అని ఒక పోస్టు షేర్ చేయగా.. ‘చిట్టి చెల్లికి పెళ్లి జరుగుతోంది. రాజస్థానీ థీమ్ ట్రై చేశాం. కానీ పెళ్లి మాత్రం తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది’ అని మరో పోస్టును పంచుకున్నాడు.
ఇక శేషు సినిమాల విషయానికి వస్తే..మొదటి నుండి విభిన్న కథలతో ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తూ వస్తున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్2.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానుననాడు. ఇటీవలే ఈ సినిమాకి సబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. మొదటి పార్ట్‌ను మించి మరింత ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఈ సినిమాను తెరెక్కించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







