శివాజీ పై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు : రవీంద్రారెడ్డి
- April 30, 2016
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి శనివారం స్పష్టం చేశారు. దేశం నుంచి ఏపీని విడదీయాలంటూ సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజద్రోహం చేసే విధంగా శివాజీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అతడిపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ హీరో శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకీ ప్రత్యేక హోదా అవసరం లేదంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి హెచ్ బీ చౌదరి నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కార్పొరేట్ పైరవీల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా మోదీ ప్రత్యేక హోదాపై పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రతి విషయంలోనూ అన్యాయం జరుగుతోందని శివాజీ అన్నారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బేవరా భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!









