ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- April 17, 2026
న్యూ ఢిల్లీ: దేశ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. దశాబ్దాల కల అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) లోక్‌సభలో ఓటింగ్ దశలో చతికిలపడింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కీలక బిల్లుకు సభలో అవసరమైన మద్దతు లభించలేదు.. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం. కానీ, జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీనితో బిల్లు ఆమోదానికి కావాల్సిన మద్దతు లభించకపోవడంతో ఇది వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఈ కీలక బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన వారిలో మూడింట రెండొంతుల మంది, అంటే 352 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, ప్రభుత్వం ఈ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో విఫలమైంది.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







