జీవో నెంబర్ 1 గురించి ఆందోళన వద్దు:ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
- January 28, 2023
అమరావతి: జీవో నెంబర్ 1 గురించి ఎలాంటి ఆందోళన వద్దని ఏపీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్.1 పై విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో డీజీపీ స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్ కు డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ఈ జీవోతో ఎవరి కార్యక్రమాలను అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇచ్చామన్నారు. ఎవరైనా పాదయాత్రలు చేయాలనుకుంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని సూచించారు. జీవో వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ పార్టీల మీటింగులకు అనుమతులు ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







