భారతీయ పాఠశాలల్లో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- January 28, 2023
ఒమన్: వచ్చే విద్యా సంవత్సరం (2023-2024) రాజధాని ప్రాంతంలోని భారతీయ పాఠశాలల్లో KG I నుండి IX తరగతుల ప్రవేశం కోసం 1 ఫిబ్రవరి 2023 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రాజధాని ప్రాంతంలోని ఏడు భారతీయ పాఠశాలలకు వర్తిస్తుంది. ఇందులో ఇండియన్ స్కూల్ బౌషర్, ఇండియన్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సైత్, ఇండియన్ స్కూల్ అల్ వాడి అల్ కబీర్, ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, ఇండియన్ స్కూల్ అల్ సీబ్, ఇండియన్ స్కూల్ అల్ మాబేలా ఉన్నాయి. చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ వీసాతో భారతీయ జాతీయత కలిగిన పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఇతర ప్రవాస జాతీయుల రిజిస్ట్రేషన్ మార్చి మొదటి వారం నుండి లభ్యత సీట్లకు లోబడి పరిగణించబడుతుంది. 1 ఏప్రిల్ 2023 నాటికి మూడు సంవత్సరాలు నిండిన పిల్లలు కిండర్ గార్టెన్ ప్రవేశానికి అర్హులు. ఇండియన్ స్కూల్ మస్కట్ ప్రాంగణంలో ఉన్న కేర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (CSE)లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 28 ఫిబ్రవరి 2023. అడ్మిషన్ ప్రాసెస్‌పై మరిన్ని వివరాలు 1 ఫిబ్రవరి 2023 నుండి www.indianschoolsoman.comలో అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







