నారా లోకేష్ 'యువగళం'కు సౌదీ అరేబియా టీడీపీ ఎన్నారైల సంఘీభావం
- January 28, 2023
రియాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకి మద్దుతుగా జనవరి 27 శుక్రవారం న యన్.ఆర్.ఐ టిడిపి సౌదీ అరేబియా కార్యవర్గం ఆధ్వర్యంలో ఖొబర్ , సౌదీ అరేబియా లో తెలుగు మహిళలతో కలిసి వందలాది ఎన్నారై టీడీపీ కార్యకర్తలు, అభిమాను లు పాద యాత్ర చేసి లోకేష్ పాదయాత్ర కు సంఘీభావం తెలియజేసారు.
పాదయాత్ర అనంతరము ప్రతేయక పూజలు , ప్రరాధనలు చేసి సంఘీభావ సమావేశం జరిగినది .ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖులతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కేరళ , తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విద్యా వేత్తలు , డాక్టర్స్ , పారిశ్రామిక వేత్తలు , సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు డాక్టర్ శంషాద్ అహ్మద్, వారిస్,హస్నాయున హకీమ్ దౌలా పాల్గోని చంద్రబాబు చేసిన అభివృధి గురించి గుర్తు చేసుకుని ఆంధ్ర ప్రదేశ్
నే కాకుండా భారత దేశం మొత్తము మరల చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటుంది అని వారు చెప్పి లోకేష్ పాదయాత్ర కు తమ సంఘీభవం తెలియ చేసారు.
నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కు ఎన్నారైల తోడ్పాటు,ప్రణాళిక రూపకల్పన మొదలగు విషయాలు పైన సమగ్ర చర్చ మరియు సలహాలు స్వీకరణ జరిగింది.
సమావేశం కు సౌదీ టీడీపి అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లాహ్ అధ్యక్షత వహించారు. గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధా కృష్ణ స్వాగాతోపన్యాసములో చంద్ర బాబు ని మరల అధికారంలో కి తీసుకు రావలిసిన ఆవశ్యకత గురుంచి జగన్ అరాచక పాలన గురించి ,ఆంధ్ర ప్రదేశ్ కి జరిగిన నష్టము గురుంచి సవివరముగా చెప్పటం జరిగింది. చంద్ర బాబు అధికారంలోకి తీసుకు రావటానికి , లోకేష్ పాద యాత్ర కు సంఘీభావం తెలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంను కాపుడుకుందాం అని విజ్ఞప్తి చేయటం జరిగింది వక్తలు అందరూ లోకేష్ పాద యాత్ర కు తమ సంఘీభావం తెలియజేసారు.
టిడిపి కార్యకర్తలు భరద్వాస్, చంద్ర శేఖర్ , భాస్కర్ , చిన్న , కోగంటి శ్రీనివాస్, భాను ప్రకాష్ , నియాజ్, పవన్ , సత్య , నవీన్ , శ్రీనివాస,శర్మ , రమేష్ , ఝాన్సీ , శ్రావ్య, వర్దిని , లక్ష్మి , సమీర, ఆంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు , మరియు టీడీపీ అభిమానులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలియచేయటం జరిగింది.



తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







