దుబాయ్ వేదికగా తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమ బోర్డు కొరకు డిమాండ్

- January 29, 2023 , by Maagulf
దుబాయ్ వేదికగా తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమ బోర్డు కొరకు డిమాండ్

దుబాయ్: దుబాయ్ లో 'మైగ్రంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం' అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు ఆధ్వర్యంలో యూఏఈ కేంద్రంగా గల్ఫ్ కార్మికుల డిమాండ్ల సాధనకై అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న సంఘాలు నేడు సమావేశమై తెలంగాణ ప్రభుత్వానికి అనేక డిమాండ్లు మరియు సూచనలు చేయటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఎన్నారై పాలసీ అమలు చేసి ఒక ప్రత్యేక బోర్డు గాని కార్పొరేషన్ గాని ఏర్పాటు చేసి  500 కోట్ల నిధులు కేటాయిస్తారని ఆశించారు. అధికారంలోకి రాకముందే టిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం నెరవేరుస్తారని ఆశించారు..కానీ ఇంతవరకు తొమ్మిది సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో  2018 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు ఎన్నారైల సంక్షేమం కోసం కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం గమనార్హం అని ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేశారు.

దుబాయ్ లో గల్ఫ్ ఎన్నారై సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించి..టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం తమ చివరి బడ్జెట్లోనైనా 500 కోట్లు కేటాయించి ప్రత్యేక ప్రవాసి సంక్షేమ బోర్డు లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా అన్ని సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు... కోటపాటి నరసింహం నాయుడు, ప్రవాసి భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక తరపున జంగం బాలకిషన్(ఎంఆర్ఎఫ్ దుబాయ్ కో-ఆర్డినేటర్) పాటుకూరి తిరుపతిరెడ్డి(తెలంగాణ ఉద్యమకారుడు మరియు గాయకుడు) జువ్వాడి శ్రీనివాసరావు(గల్ఫ్ తెలంగాణ సంక్షేమ అసోసియేషన్), గుండెల్లి నరసింహులు(జి.టి.డ.బ్ల్యూ),   భూమయ్య(జి.డబ్ల్యూ.పి.సి ) ఉట్నూరి రవి( దుబాయ్ ఎల్లాల శీనన్న సేవాసమితి) బాలు బొమ్మాడి, భవాని బాబురావు, మహేందర్, కే.మహేందర్, వంశి గౌడ్, కోరేపి మల్లేశం( జి.డబ్ల్యు.ఏ.సి) ఇండియన్ పీపుల్స్ ఫోరం,అరుణ్ కుమార్ సుర్నిదా, కల్లెడ భూమన్న జన్నారం, మదన్,నారాయణ జైతా మరియు ఆకుల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com