అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- December 25, 2025
అమెరికా: విశాఖపట్నంలో అమెజాన్ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది.పెందుర్తి వద్ద రెండేళ్ల క్రితం డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆ సంస్థ ప్రారంభించింది. వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త విస్తరణ ప్రణాళికలు, విశాఖపట్నం టెక్నాలజీ హబ్‌గా మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడతాయని ఆశిస్తున్నారు. అమెజాన్ విశాఖలో తన కార్యకలాపాలను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకుంది.
ప్రస్తుతం 300 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ, రాబోయే మూడేళ్లలో మరో 533 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దీని ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య 833కి చేరుతుంది. ఈ విస్తరణకు అవసరమైన పెట్టుబడిని కూడా రెట్టింపు చేయాలని అమెజాన్ యోచిస్తోంది.ఈ-కామర్స్ రంగంలో తమ ఎగుమతులను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు సాగుతోంది.
రాబోయే కాలంలో రూ.100 కోట్ల మేర ఈ-కామర్స్ ఎగుమతులను పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు. అమెజాన్ తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI)లో తమ సంస్థను రీ-రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని విస్తరించి 850 మందిని నియమించుకోనుందని IT వర్గాలు తెలిపాయి. మూడేళ్లలో ₹9,740 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







