'తొలి కిరణం' పాటల చిత్రీకరణకు ఈజిప్టుకు...

- April 30, 2016 , by Maagulf
'తొలి కిరణం' పాటల  చిత్రీకరణకు ఈజిప్టుకు...

సువర్ణ క్రియేషన్స్‌ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్‌ బాబు దర్శకత్వంలో టి.సుధాకర్‌ నిర్మిస్తున్న సినిమా 'తొలి కిరణం'. మూడు పాటల మినహా చిత్రీకరణ పూర్తి చేసు కొంది. ఈ సందర్భంగా దర్శకుడు జె.జాన్‌ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలనుసహజ సిద్ధంగా చిత్రీకరించేందుకు జెరుసలేం, ఈజిప్టు దేశాలకు వెళ్ళనున్నాం. ఇప్పటి వరకు వచ్చిన జీసస్‌ చిత్రాలలో ఎవరూ.. స్మృశిం చని కోణాలను ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలియబరచబోతున్నాం. ఈ చిత్రానికి క్రైస్తవ సమాజం నుంచే కాక, ఇతర వర్గాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతాన్ని ఇచ్చారు. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అని చెప్పారు. నిర్మాత సుధాకర్‌ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చింది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించ డానికి ఈజిప్టు వెళ్ళబోతున్నాం. ఆర్‌.పి గారు అందించిన మ్యూజిక్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుం టుంది'' అని చెప్పారు.ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ.. కళలకు మతం లేదు. సినిమాకు కూడా మతం లేదు. ఇదొక మనిషి సినిమా. జీసస్‌ జీవితంలో జరిగిన నలభై రోజుల అధ్బుత ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. డిఫరెంట్‌ స్క్రీన్‌ ప్లేతో సినిమా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే పాట లను చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు మ్యూజిక్‌ చేశాను'' అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com