అమల్లోకి వచ్చిన కొత్త ఉచిత సౌదీ ట్రాన్సిట్ వీసా
- January 31, 2023
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త ట్రాన్సిట్ వీసా అమల్లోకి వచ్చింది. ఇది ప్రయాణీకులు దేశం మీదుగా వెళ్ళినప్పుడు 4 రోజుల పాటు ట్రాన్సిట్ వీసాను పొందేందుకు వీలు కల్పిస్తుంది. విమానయాన సంస్థ నుండి టిక్కెట్‌ను కలిగి ఉన్న ప్రయాణీకులు 96 గంటలపాటు దేశంలో ఉండేందుకు వీలు కల్పింస్తుంది. ఆ సమయంలో వారు హజ్, ఉమ్రా చేయవచ్చని సౌదియా గతంలో పేర్కొంది. ఎలక్ట్రానిక్ సేవ సోమవారం నుండి అమలులోకి వస్తుంది. ఇది సౌదీ ఆధారిత విమానయాన సంస్థలు సౌదియా, ఫ్లినాస్ వెబ్సైట్ల ద్వారా అప్లికేషన్లో అందుబాటులో ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపుతారు. వారు వాటిని ప్రాసెస్ చేసి, డిజిటల్ వీసాను జారీ చేస్తారు. వీసా ఉచితం. మూడు నెలల చెల్లుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







