కువైట్‌లో ఐటీఎఫ్ టోర్నమెంట్: విజేతగా భారత ఆటగాడు ప్రజ్నేష్
- January 31, 2023
కువైట్: ఆదివారం కువైట్‌లో జరిగిన ఐటీఎఫ్ కువైట్ పురుషుల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేష్ గుణేశ్వరన్(33) విజేతగా నిలిచాడు. 360 మాల్లోని షేక్ జాబర్ అల్-అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబా ఇంటర్నేషనల్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన $25,000 ITF పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో ప్రజ్నేష్ 6-2, 7-6(5)తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఖుమోయున్ సుల్తానోవ్ను ఓడించాడు. 19 దేశాలకు చెందిన 41 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్ కువైట్, అరబ్ టెన్నిస్ ఫెడరేషన్ల అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబా పర్యవేక్షణలో జరిగింది. ఫైనల్ మ్యాచ్‌కు కువైట్ టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఫలేహ్ అల్-ఒతైబీ హాజరయ్యారు. 2019లో కెరీర్లో అత్యధికంగా 75వ స్థానంలో నిలిచిన ప్రజ్నేష్కు ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఇది 11వ టైటిల్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







