అయ్యో పాపం.! ఇలియానాకి ఏమైంది.?
- January 31, 2023
గోవా బ్యూటీ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన ఇలియానాకి ఇప్పుడంత సీనూ సినిమా లేకుండా పోయింది. ఎంత ప్రయత్నించినా పాపం తెలుగులో అవకాశాలు రావడం లేదు ఇలియానాకి. హిందీలో ఏదో అలా అలా కష్టపడుతోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే తాజాగా ఇలియానా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. చేతికి ఐవీతో వున్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. దాంతో, ఇలియానాకి ఏమైంది.? అంటూ ఆరా మొదలైంది. దాంతో తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్థతలు తెలుపుతూ, ఇలియానా స్వయంగా రెస్పాండ్ అయ్యింది.
బాడీ డై స్మోర్ఫిక్ డిజార్డర్ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త కుదట పడిందట. కేవలం ఫ్లూయిడ్స్ మాత్రమే ఎక్కిస్తున్నారట. త్వరలో కోలుకుంటానని అభిమానుల్ని ఆందోళన పడొద్దని తెలిపింది ఇలియానా.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







