షూటింగ్ స్పాట్ కు హెలికాప్టర్ లో వస్తున్న కమల్ హాసన్
- February 01, 2023
హైదరాబాద్: లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఇండియన్ 2 మూవీ చేస్తున్నాడు.ఈ చిత్ర తాజా షెడ్యూల్ గండికోటలో ప్లాన్ చేసారు.ఓ వారం రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది.ఈ క్రమంలో కమల్ హాసన్ రోజు తిరుపతి నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో షూటింగ్ స్పాట్ కు చేరుకుంటున్నారు.వీటి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.కమల్ తో పాటు ఆయన స్టైలిస్ట్ అమృత రామ్ కూడా ఇందులోనే ప్రయాణిస్తున్నారు. కూరగాయలు, పశువుల అమ్మకాలు జరుగుతున్న మార్కెట్‌పై బ్రిటీష్ పోలీసులు దాడి చేస్తుంటే, కమల్ వారిని ఎదుర్కునే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
1996 లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికి ఈ సినిమా బుల్లితెర ఫై ప్రసారమవుతూ..అలరిస్తుంటుంది. ఇక ఇండియన్ 2 మూవీ ఎప్పుడో షూటింగ్ మొదలైంది..కాకపోతే చిత్ర సెట్ లో ప్రమాదం జరగడం పలువురు మృతి చెందడం , ఆ తర్వాత బడ్జెట్ ఎక్కువ కావడం తో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలైంది. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్ దీనిని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్







