ఆహా అన్‌స్టాపబుల్ 2.! ‘పవర్’ తట్టుకోగలదా.?
- February 02, 2023
ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి టైమ్‌లో ప్రసారం కావల్సిన ఈ ఎపిసోడ్ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది.
ఫిబ్రవరి 3న ప్రసారం కానున్నట్లుగా అధికారికంగా తెలిపింది ఆహా టీమ్. అయితే అభిమానుల కోరిక మేరకు ఒక్క రోజు ముందు అనగా ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానుంది. అంతా బాగానే వుంది.
గతంలో ప్రబాస్ ఎపిసోడ్‌ని ఆహా ట్యాకిల్ చేయలేకపోయింది. అభిమానులంతా ఒక్కసారిగా పోటెత్తడంతో సర్వర్ సమస్యలు తలెత్తి కొన్ని గంటల సేపు ఆ ఎపిసోడ్ తాత్కాలికంగా పని చేయలేదు.
దాంతో, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఆహా కొన్ని ప్రత్యేక టీమ్స్‌ని సెట్ చేసిందట. ముందుగానే ఆ టీమ్ తమ వర్క్ మొదలెట్టేశాయట. ఎంతమంది పోటెత్తినా సర్వర్ క్రష్ అవ్వకుండా వుండాలన్న వుద్దేశ్యంతో ఈసారి ఆహా బాగానే జాగ్రత్త పడిపోయిందన్నమాట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







