కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువే..
- May 01, 2016
కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువే - ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామన్న మంత్రి నాయినిహైదరాబాద్ రాష్ట్రంలో కనీస వేతనం రూ.10వేల కంటే ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం ఇక్కడ తెలిపారు.''దేశ వ్యాప్తంగా కనీస వేతనం రూ.10వేలు ఉండేలా చట్టం చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. కానీ తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కనీస వేతనం రూ.10వేల కంటే ఎక్కువగనే ఉంటుంది. మేడే సందర్భంగా ప్రకటించాలనుకున్నాం. కానీ అధికారుల బదిలీల కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెలాఖరు లోగా తీపి కబురు వింటారు'' అని నాయిని వ్యాఖ్యానించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో మంత్రి నాయిని ముఖ్య అథితిగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







