విశాఖ- తిరుపతి డబుల్‌డెక్కర్ రైలు...
- May 01, 2016
కాచిగూడ-గుంటూరు మాదిరిగా మరోటిఈ నెలాఖరులోగా ప్రారంభించే అవకాశాలు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొత్తకొత్త రైళ్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ-హైదరాబాద్, విశాఖ-తిరుపతి మధ్య విజయవాడ మీదుగా డబుల్‌డెక్కర్ రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే సర్వేలను పూర్తి చేసి నివేదికలను కేంద్ర రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పంపించారు. రైల్వే బోర్డు నుంచి అనుమతి రావడమే ఆలస్యమన్నట్టుగా డబుల్‌డెక్కర్ రైళ్లకు అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరున పట్టాలెక్కనుంది. ఈ డబుల్‌డెక్కర్‌లో ఉండే 18 బోగీలన్నీ ఏసీవే కావడం విశేషం. చైర్‌కార్ కావడంతో ఈ రైలును విశాఖపట్నంలో ఉదయం బయల్దేరేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ విశాఖ-తిరుపతి మార్గంలో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉంటే విశాఖ-హైదరాబాద్ మధ్య నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య డబుల్‌డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి.వీటిలో ఒక రైలునుగానీ, మరో కొత్త రైలును గానీ విశాఖ-తిరుపతి మధ్య నడిపే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. విశాఖపట్టణంలో మధ్యాహ్నం బయల్దేరి రాత్రికి విజయవాడ చేరుకుని, తెల్లవారుజామున తిరుపతి చేరితే ప్రయాణికుల నుంచి ఆదరణ లభించే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







