పాకిస్థాన్: ఘోర రోడ్డు ప్రమాదం..30 మంది మృతి
- February 08, 2023
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కోహిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కారు ఒకదాన్నొకటి బలంగా ఢీకొని లోయలో పడిపోయాయి. గిల్గిత్ నుంచి రావల్పిండి వెళ్తున్న బస్సు షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ప్రాంతంలో చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖాలిద్ ఖుర్షీద్ అధికారులను ఆదేశించారు.
ప్రమాద విషయం తెలిసిన ప్రధాని షేబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కోరారు. అధ్యక్షుడు అరీఫ్ అల్వీ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదాలు ఇటీవల సర్వసాధారణంగా మారాయి. గత నెలలో బలూచిస్థాన్‌లోని లాస్బెలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







