లేఆఫ్‌ల బాటలో విమానాల తయారీ సంస్థ బోయింగ్

- February 08, 2023 , by Maagulf
లేఆఫ్‌ల బాటలో విమానాల తయారీ సంస్థ బోయింగ్

డెల్,పేపాల్,గూగుల్,అమెజాన్,జొమాటో, ఇంటెల్ ఇలా ఎన్నో కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోవటానికి ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ బాటలోనే నేను కూడా అంటోందో విమానాల తయారీ సంస్థ బోయింగ్..

టెక్ సంస్థలు, ఈ-కామర్స్ సంస్థలు భారీగా ఉద్యోగాల్ని తొలగించుకుంటున్న సమయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ కూడా అదే బాటలో నడవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయంటోంది. రెండు వేలమంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది బోయింగ్. బోయింగ్ యాజమాన్యం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో రెండు వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.

కాగా రెండు వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న బోయింగ్ వారి స్థానంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకుంటోంది. ఎందుకంటే వారికి జీతాలు తక్కువ ఇవ్వొచ్చు కాబట్టి. ఓ పక్క పనీ జరుగుతుంది..మరోపక్క ఆర్థిక భారం తగ్గుతుంది. ఇటువంటి నిర్ణయంతో బోయింగ్ టీసీఎస్ సంస్థ ద్వారా ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. హెఆర్, ఫైనాన్స్ కు సంబంధించిన ఉద్యోగుల్ని తొలగించనుంది. ఇక పోతే 2023లో ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ విభాగాల్లో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగులను తీసుకోనుంది బోయింగ్ యాజమాన్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com