యూఏఈ నుంచి భారత్ కు కొత్త సర్వీసు ప్రారంభించిన ఎయిర్ అరేబియా
- February 12, 2023
అబుధాబి: అబుధాబి నుంచి భారత్‌లోని కోల్‌కతా నగరానికి ఎయిర్ అరేబియా ఎయిర్‌లైన్స్ కొత్త సర్వీస్‌ను ప్రకటించింది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతా ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు వారానికి మూడుసార్లు ఈ సర్వీస్ ఉంటుంది. మార్చి 15వ తేదీ నుంచి సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా తాజాగా వెల్లడించింది. సోమ, బుధ, శనివారం సర్వీస్ నడిపించనుంది.ఈ మూడు రోజులు అబుధాబి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు విమానం బయల్దేరుతుంది. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో రాత్రి 8.20 గంటలకు ల్యాండ్ అవుతుంది. తిరిగి కోల్‌కతా నుంచి రాత్రి 9.05 గంటలకు బయల్దేరి, తెల్లవారుజామున 1.05 గంటలకు అబుధాబి విమానాశ్రయంకు చేరుకుంటుంది.దీని 0కోసం ఎయిర్ బస్ ఏ320ను వినియోగించనున్నట్లు ఎయిర్ అరేబియా సీఈఓ అదేల్ అల్ అలీ వెల్లడించారు.
కాగా, భారత ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే కోల్‌కతా నుంచి ఈ కొత్త సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.అంతేగాక ఈ కొత్త సర్వీస్ రెండు దేశాల మధ్య వ్యాపారం, సాంస్కృతిక మార్పిడితో పాటు కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు.ఇక ఎయిర్ అరేబియా అబుధాబి అనేది లోకాస్ట్ క్యారియర్ అనే విషయం తెలిసిందే.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా మొత్తం 28 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడిపిస్తుంది. ఇప్పటికే భారత్‌లోని కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌కు విమానాలు నడుపుతోంది.ఇప్పుడు ఇండియాలో ఏడవ గమ్యస్థానంగా కోల్‌కతాను ఎంచుకుంది. అబుదాబి నుంచి కోల్‌కతా వెళ్లాలనుకునే ప్రయాణికులు ఎయిర్ అరేబియా అధికారిక వెబ్సైట్ https://www.airarabia.com/ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







