భార్య డ్యాన్స్ చేస్తుందని విడాకులు ఇచ్చేశాడు..
- May 02, 2016
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం మామూలే.. పెద్ద జగడాలు జరిగినా విడాకులు వరకు వెళ్లడానికి ఈ రోజుల్లో ఎవరూ సిద్ధంగా ఉండడం లేదు. కానీ, ఖతార్‌లో మాత్రం ఓ భర్త తన భార్య డ్యాన్స్ చేస్తుందని విడాకులు ఇచ్చేశాడు. భక్తి చానళ్లు తప్ప వేరే చానళ్లు ఏవీ చూడకూడదని పెళ్లి అయిన కొత్తలో ఆమె చేత ప్రమాణం చేయించుకున్నాడు సదరు భర్త. అయితే ఓ చానల్లో తనకిష్టమైన పాట వస్తుండడంతో తనను తాను తమాయించుకోలేక ఆమె కాలు కదిపింది.సరిగ్గా అదే సమయానికి ఆఫీసు నుంచి వచ్చిన భర్త అది చూసి కోపోద్రిక్తుడయ్యాడు. నా ఆజ్ఞను పట్టించుకోవా అంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. వెంటనే విడాకులు కూడా ఇచ్చేశాడు. పెళ్లినాటి ప్రమాణాలను మరచి, తనను మోసం చేసిన భార్యను క్షమించేదిలేదని కూడా స్పష్టం చేశాడు. అయితే ఈ విషయాన్ని వెల్లడించిన సౌదీ మీడియా ఆ భార్యభర్తల వివరాలు మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









