మార్చి 31 నుంచి ఐపీఎల్..
- February 17, 2023
టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ సీజన్ (16వ) ఐపీఎల్ జరగనుంది. అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి.
ఐపీఎల్ మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ రనపర్ గా నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు ఎంతో ప్రత్యేకం. గెలిచేది ఏ జట్టు అయినా అది తమ జట్టుగానే భావిస్తారు భారతీయులు. మొత్తం 10 జట్లు ఉన్నప్పటికీ ఒక్కో అభిమానికి ఒక్కో జట్టు ఫేవరెట్ గా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభించినప్పటి నుంచి అన్ని సీజన్లూ సూపర్ హిట్ అయ్యాయి. కొత్త కుర్రాళ్లలో ప్రతిభను బయటకు తీయడానికి, వారిని ప్రోత్సహించడానికి కూడా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది.
Full schedule of IPL 2023. pic.twitter.com/9WdSMFejBG
— Johns. (@CricCrazyJohns) February 17, 2023
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







