కువైట్ విమానాశ్రయంలో బయో-మెట్రిక్ స్కానింగ్ ప్రారంభం

- February 17, 2023 , by Maagulf
కువైట్ విమానాశ్రయంలో బయో-మెట్రిక్ స్కానింగ్ ప్రారంభం

కువైట్: ఫోర్జరీకి పాల్పడిన వారితో సహా బహిష్కరణకు గురైన వారిని దేశానికి తిరిగి రాకుండా నిరోధించే ప్రయత్నంలో అంతర్గత మంత్రిత్వ శాఖ త్వరలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు అన్ని సరిహద్దులలో ఐరిస్, ముఖం, చేతి స్కానింగ్, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ విధానాలతో సహా బయో-మెట్రిక్ స్కాన్ ఫీచర్‌లను అమలు చేయడం ప్రారంభించింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి, రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ బయో-మెట్రిక్ ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మొదటి దశ కింద వచ్చే నెల నాటికి కువైట్‌లోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పోర్ట్‌లలో అమలు చేయబడగాయని పేర్కొన్నారు. ఈ ఫీచర్ వేలిముద్రలు, ముఖం, కంటి కనుపాపలను తనిఖీ చేయడం ద్వారా ప్రయాణానికి ముందు స్థానిక, అంతర్జాతీయ నిషేధిత జాబితాలను పరిశీలిస్తుంది. తద్వారా ప్రయాణికుల ముఖ్యమైన లక్షణాలను సరిపోల్చడం ద్వారా ప్రయాణికుల కోసం ప్రవేశ, నిష్క్రమణ విధానాలను అప్‌డేట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఓడరేవుల వద్ద వాహనాలను కూడా తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com