భారతీయ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ‘హీరో’కి ఘనంగా వీడ్కోలు

- February 17, 2023 , by Maagulf
భారతీయ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ‘హీరో’కి ఘనంగా వీడ్కోలు

బహ్రెయిన్: భారతీయ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ICRF)కు సుధీర్ఘ కాలంగా సేవలు అందించిన ఐసీఆర్ఎఫ్ నిజమైన హీరో అయిన ఫ్లోరిన్ మథియాస్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.  మథియాస్ 1999లో ICRF స్థాపించబడినప్పటి నుండి దాని క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. ఈ సమయంలో బహ్రెయిన్‌లో చాలా మంది భారతీయ పౌరులకు సహాయం చేశారు. ఆమె 1961లో భారతదేశం నుండి బహ్రెయిన్‌ వచ్చారు. 1964 నుండి ఆమె దాదాపు 60 సంవత్సరాలపాటు నిబద్ధతతో సమాజ సేవలో పాల్గొన్నారు. ఆమె మైగ్రెంట్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీలో సభ్యురాలిగా ఉన్నారు.  దీని ద్వారా ఆమె వివిధ దేశాలకు చెందిన వ్యక్తులకు సహాయం చేసింది. ఆమె ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. ICRFకి ఆమె చేసిన అమూల్యమైన సేవలను అభినందిస్తూ, ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువతో మథియాస్‌ని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ, భారత రాయబార కార్యాలయంలో రెండవ కార్యదర్శి రవిశంకర్ శుక్లా, ICRF కార్యనిర్వాహక బృందం ఘనంగా సన్మానించారు. అనంతరం సీఫ్‌లోని రామీ గ్రాండ్ హోటల్‌లో ఆమె గౌరవార్థం వీడ్కోలు విందును ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com