సినిమా రివ్యూ: ‘వినరో భాగ్యము విష్ణు కథ’

- February 18, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘వినరో భాగ్యము విష్ణు కథ’

‘రాజా వారు రాణి వారు’ సినిమాతో ఓ సాధారణ హీరోగా పరిచయమైన కుర్రోడు కిరణ్ అబ్బవరం. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడీ యంగ్‌స్టర్. కిరణ్ నటించిన సినిమాలు వస్తున్నాయ్. పోతున్నాయ్. ఆ కోవలోనే తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమాని శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్లు. మరి, ఈ సినిమా ఎలా వుంది.? కిరణ్ అబ్బవరం కెరీర్‌కి ఏమైనా కలిసొస్తుందా.? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
నైబర్ నెంబర్ కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందిందన్న సంగతి ముందే తెలుసు. అలా నైబర్ నెంబర్స్ ద్వారా కలుసుకున్న ముగ్గురు వ్యక్తులు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కాశ్మీరా పరదేశి, సీనియర్ నటుడు మురళీ శర్మ. ఓ ప్రాంక్ వీడియో చేస్తూ మురళీ శర్మ ప్రమాదవశాత్తూ చనిపోతాడు. ఆ కేసులో ఇరుక్కున్న హీరోయిన్‌ని రక్షించే హీరో ప్రయత్నమే ‘వినరో భాగ్యము విష్ణు కథ’. హీరోయిన్‌ని కాపాడే క్రమంలో మన హీరో ఎదుర్కొన్న కష్టాలేంటీ.? కథలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ, అన్ని సినిమాల్లోనూ ఒకే రకమైన తప్పులు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఒకే తరహా యాక్టింగ్ స్కిల్స్‌తో బోర్ కొట్టించేస్తున్నాడు. తనను తాను సినిమా సినిమాకీ మౌల్డ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడన్న విమర్శలు వస్తున్నాయ్. అలాంటి విమర్శలే ఈ సినిమాకీ కీరణ్ అబ్బవరం అందుకుంటున్నాడు. ఇక హీరోయిన్ జస్ట్ ఓకే. సినిమాకి ప్రాణం మురళీ శర్మ పాత్ర. ఆయన తన అనుభవాన్నంతా రంగరించి నటించేశాడు. మిగిలిన పాత్రధారులంతా తమ పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
నైబర్ నెంబర్స్.. మన ఫోన్ నెంబర్‌కి ఇటూ అటూ వున్న నెంబర్లలో వున్న వ్యక్తులతో స్నేహం చేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా వుంది. కానీ, కథనం మాత్రం కలగాబులగం చేసేశాడు డైరెక్టర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. నిర్మాణం పరంగా ఈ సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. ఎక్కడా రాజీ పడలేదు మేకర్లు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నేపథ్యసంగీతం ఓకే. అయితే, ఎడిటింగ్‌లో చాలా తప్పులున్నాయ్. చాలా చోట్ల కత్తెర పడాల్సి వుంది. సాగతీత సన్నివేశాలు అబ్బో.! దారుణంగా విసుగు తెప్పిస్తాయ్.

ప్లస్ పాయింట్స్:
కథలో కొత్తదనం, 
మురళీ శర్మ పర్‌ఫామెన్స్

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో అనవరసరమైన యాక్షన్ ఎలివేషన్లు
హీరో రెగ్యులర్ పర్‌ఫామెన్స్,
నీరసంగా సాగిన సన్నివేశాలు..

చివరిగా: ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. ధియేటర్లో భరించడం చాలా కష్టమే బాస్. ఓటీటీకీ ఓపిక వుండాల్సిందే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com