చిరు ట్వీట్: చరణ్ సాధించిన ఘనత ఆస్కార్ కంటే ఎక్కువే.!
- February 18, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా.. కాదు కాదు, ప్యాన్ వరల్డ్ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ‘అవతార్’ తదితర చిత్రాలతో ప్రపంచం గర్వించదగ్గ ఫిలిం మేకర్ అయిన జేమ్స్ కెమెరూన్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి ఇటీవల ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం జరిగింది.
Sir @JimCameron an acknowledgement of his character in #RRR from a Global Icon & Cinematic Genius like you is no less than an Oscar itself! It’s a great honor for @AlwaysRamCharan As a father I feel proud of how far he’s come. Ur compliment is a blessing for his future endeavours pic.twitter.com/jof3Q9j0pA
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2023
ఆ ట్వీట్‌కి ఎమోషనల్ అయిన మెగాస్టార్ చిరంజీవి, జేమ్స్ కెమెరూన్ ప్రశంసించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఇది ఆస్కార్ కన్నా గొప్ప ప్రశంస.. అని తాజాగా ట్వీట్ చేశారు. పుత్రోత్సాహం అలా వుంటుంది మరి. అయితే, ఈ చిరంజీవి ట్వీట్‌ని తప్పు పడుతూ కొందరు సోషల్ ఆకతాయిలు విమర్శలు చేస్తున్నారు.
అవును నిజమే, ‘ఆర్ఆర్ఆర్’ క్రెడిట్ అంటే.. కేవలం రామ్ చరణ్‌ది మాత్రమే కాదు. ఎన్టీయార్, రాజమౌళి, కీరవాణి.. ఇలా చాలా మంది పేర్లు ప్రస్థావించాల్సి వుంటుంది. అయితే, సగటు తండ్రిగా తన పుత్రుని గొప్పతనానికి ఉప్పొంగిపోతూ, తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పంచుకోవడంలో తప్పేముందో ఆ విమర్శలు చేసిన వారికే ఎరుక.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







