అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం..
- February 18, 2023
బెంగుళూరు: నందమూరి తారకరత్న క్షేమంగా తిరిగి వస్తారని , ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని అంత భావిస్తున్న సమయంలో ఓ వార్త బయటకు వచ్చి ఇప్పుడు అందర్నీ కలవరపాటుకు గురిచేస్తుంది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెపుతున్నారు. బెంగళూరులో నారాయణ హృదయాలయ హాస్పటల్ వర్గం మరోసారి ఆయనకు బ్రెయిన్ స్కాన్ చేయడం జరిగింది. గత 22 రోజులుగా విదేశీ డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు డాక్టర్స్ ట్రై చేస్తున్నప్పటికీ ఆయన రెస్పాండ్ కావడం లేదు. మునపటి కంటే మరింతగా ఆయన ఆరోగ్యం విషమంగా మారిందని చెప్పడం తో…కుటుంబ సభ్యులు హాస్పటల్ కు చేరుకుంటున్నారు. ఇప్పటీకే బాలకృష్ణ హాస్పటల్ కు చేరుకొని డాక్టర్స్ తో మాట్లాడారు.
22 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి తారకరత్న కు చికిత్స అందజేస్తూ వస్తున్నారు. తారకరత్న క్షేమంగా తిరిగిరావాలని యావత్ నందమూరి అభిమానులు , ప్రజలు కోరుకుంటూ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం తాజా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







