తెలుగులో విలన్ పాత్రలు పోషిస్తా: సుధీర్ బాబు
- May 03, 2016
తెలుగులో విలన్ పాత్ర చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతం లేదంటున్నాడు టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు. సుధీర్‌బాబు విలన్‌గా నటించిన బాలీవుడ్ చిత్రం 'బాఘీ' ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ నటీనటులు ఫోన్ చేసి చిత్రంలోని తన నటనను మెచ్చుకున్నారని.. వారి ప్రశంసలు తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయని అంటున్నాడు.
సినీ కెరీర్ ప్రారంభంలో 'ఏం మాయ చేశావో' చిత్రంలోను చిన్న నెగిటివ్ పాత్రలో నటించానని తెలిపాడు. త్వరలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ జీవితం ఆధారంగా ఓ సినిమా నిర్మిస్తున్నారని.. అందులో గోపిచంద్ పాత్రలో తాను నటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్ర స్క్రిప్టు ప్రస్తుతం ప్రారంభదశలో ఉందని.. త్వరలోనే ఈ చిత్రం పూర్తి వివరాలను తెలియజేస్తామన్నాడు. తనకు బ్యాడ్మింటన్ బాగా వచ్చని ఆ పాత్రలో నటించడం కష్టమేమి కాదన్నాడు.
సుధీర్‌బాబు విలన్‌గా నటించిన బాలీవుడ్ చిత్రం 'బాఘీ' మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతుంది. చిత్రంలో బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించారు. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.45.30కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ తొలిరోజు వసూళ్లలో 'ఫ్యాన్', 'ఎయిర్‌లిఫ్ట్' తరువాత బాఘీ మూడో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







