భారత సైనికాధికారులపై నిఘాపెట్టిన ఐఎస్ఐ
- May 03, 2016
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత సైనిక అధికారులపై నిఘా పెట్టింది. స్మార్ట్ఫోన్లలోని గేమింగ్, మ్యూజిక్ అప్లికేషన్ల ద్వారా మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్ను చొప్పించి సమాచారం సేకరిస్తోందని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికోసం టాప్‌గన్, ఎంపీజంకీ, వీడీ జంకీ, టాకింగ్ ఫ్రాగ్ వంటి అప్లికేషన్లను వాడుకుంటోందని ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి తెలిపారు.
పాకిస్థానీ నిఘా ఏజన్సీలు ముఖ్యంగా ఎక్స్సర్వీస్మెన్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపారు. వారికి ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఎర చూపి వారిని వాడుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఐఎస్ఐ మాల్వేర్ మొబైల్ యాప్‌లను పంపిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆయన చెప్పారు. 2013-16 మధ్య కాలంలో దాదాపు ఏడుగురు ఎక్స్సర్వీస్మెన్ని గూఢచర్యం కేసుల్లో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







