రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు
- February 22, 2023
న్యూ ఢిల్లీ: నూతన విద్యావిధానంలో భాగంగా ఇకపై ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందగోరే చిన్నారులకు తప్పనిసరిగా ఆరేళ్లు నిండి ఉండాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు బుధవారం (ఫిబ్రవరి 22) ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలనేడే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం తన లేఖలో పేర్కొంది.
అలాగే అంగన్వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించాలి. ఈ కోర్సును ఎస్సీఈఆర్టీ, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ల (డైట్) ద్వారా అమల్లోకి తీసుకురావలని’ కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







