తజికిస్థాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం
- February 23, 2023
యూఏఈ: తజికిస్తాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.37 గంటలకు భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని, సుమారు 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రాన్ని ఉటంకిస్తూ చైనా ప్రభుత్వ టెలివిజన్ CCTV వెల్లడించింది. భూకంప కేంద్రం చైనాకు సమీప సరిహద్దు నుండి 82 కి.మీ దూరంలో ఉంది. జిన్‌జియాంగ్ ప్రాంతంలోని పశ్చిమ భాగంలోని కష్గర్, ఆర్టక్స్‌లో బలంగా ఉన్నట్లు CCTV తెలిపింది. భూకంప కేంద్రం నుండి 5 కిమీలోపు( 4,655 మీటర్లు-15,300 అడుగులు) ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







